అమెజాన్. ఫ్లిప్ కార్ట్ సంస్థలు నిత్యావసర సరుకులను ఆన్ లైన్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటికి పోటీగా జియో మార్ట్ రంగంలోకి దిగింది. రిలయన్స్ జియో మార్ట్ వెబ్‌సైట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక డిస్కౌంట్స్, ఆఫర్లతో పాలు, కూరగాయలతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. పిన్ కోడ్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా నివశించే ప్రాంతానికి డెలివరీ ఉందో లేదో అర్థం చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో మార్ట్ ఇప్పటివరకు ముంబైలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. పండ్లు, కూరగాయాలు, ఇంటికి సంబంధించిన నిత్యవసర వస్తువులను ప్రస్తుతం జియో మార్ట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. 750 రూపాయలలోపు షాపింగ్ చేస్తే డెలివరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేవీ ముంబయి, థానే, కల్యాణ్ వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.