ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన - మీ సూచన పేరుతో ఏడాది పాలన పూర్తైన సందర్భంగా సంక్షేమంపై సదస్సు నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని అమ్మఒడి పథకాన్ని అమలు చేసి 43 లక్షల మంది తల్లల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తున్నామని తెలిపారు. 82 లక్షల మంది పిల్లలకు మేనమామ తోడుగా ఉంటాడని తెలిపారు. 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద కిట్లను పంపిణీ చేయనున్నామని తెలిపారు. 
 
రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు బాగా పని చేస్తున్నారని సీఎం తెలిపారు. జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ చేస్తామని తెలిపారు. కులం, మతం, పార్టీ తేడాల్లేకుండా పథకాల అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల వాలంటీర్ల, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: