తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 108 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2099కు చేరింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 76 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఈరోజు రంగారెడ్డిలో 6, మేడ్చల్ 3, జగిత్యాల 12, సిరిసిల్ల మూడు, మంచిర్యాల 3, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్ధిపేట్, వికారాబాద్ లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఈరోజు రాష్ట్రంలో కరోనా కేసులు, లాక్ డౌన్ పొడిగింపు, ఉద్యోగుల వేతనాలు, సడలింపుల గురించి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1500 రూపాయక నగదు కార్యక్రమాన్ని నిలిపివేయనున్నట్టు ప్రకటించారు.