దేశంలో కరోనా విజృంభణతో మోదీ సర్కార్ లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సామాన్య, పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించేవారు, వీధివ్యాపారులు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు. రెక్కాడితే కాని డొక్కాడని వారు లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ఒక కుండల విక్రేత మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఎదుర్కొన్న కష్టాలను చెప్పాడు. 
 
లాక్ డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మట్టి కుండల విక్రయాలు తగ్గాయని... తక్కువ ఆదాయంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కుండల వ్యాపారి చెప్పాడు. గతంలోలా ఈ సంవత్సరం ప్రజలు మట్టి కుండలు కొనుగోలు చేయలేదని... గత సంవత్సరం రోజుకు 100 నుంచి 150 మట్టి కుండలను విక్రయించగా ఈ సంవత్సరం రోజుకు 50 కుండలు కూడా అమ్ముడుపోలేదని అన్నాడు. లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయాననని కుండల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: