ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పారిశ్రామిక వేత్తలతో మేధోమథన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలొ 13,122 సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులు వచ్చేలా చట్టం చేశామని తెలిపారు. రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ బలంగా ఉందని సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ద్వారా బలమైన పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడిందని... గ్రామస్థాయిలోకి పోలీసింగ్ వ్యవస్థ వెళ్లడం దేశంలోనే మొదటిసారి జరిగిందని... ఈ విషయంలో ఏపీ నెంబర్ వన్ అని సీఎం జగన్ అన్నారు. 11,550 కోట్ల రూపాయలతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు.