దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా భారీన పడకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. అయితే తాజాగా 36 రోజుల పసికందు కరోనాను జయించింది. 

 

మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబైలో 36 రోజుల బాలుడికి కరోనా సోకగా చిన్నారికి ప్రత్యేకంగా చికిత్స అందించి వైద్యులు కంటికి రెప్పలా కాపాడారు. 15 రోజుల చికిత్స అనంతరం బాలుడికి పరీక్షలు చేయగా కరోనా నెగిటివ్ అని తేలింది. తాజాగా వైద్యులు బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. బాలుడు కరోనాను జయించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: