తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. రాష్ట్ర సరిహద్దులో సముద్ర మట్టానికి 100 మీటర్ల లోపే గోదావరి గరిష్ట ఎత్తుకు చేరే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మర్కూక్ పంప్ హౌజ్ లలో మోటార్లు ఆన్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 4.30 గంటల సమయంలో చండీ యాగం ప్రారంభం కాగా కేసీఆర్ సతీసమేతంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. 
 
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ లో రెండు పంప్ హౌస్ లు ఉంటాయి. మొదటి పంప్ హౌస్ లో 3.7 కిలోమీటర్ల కెనాల్ పనులు, రెండో పంప్ హౌస్ లో 6.75 కిలోమీటర్ల పనులు పూర్తవుతాయి. కొండపోచమ్మ సాగర్ గరిష్ట ఎత్తు 300 అడుగులు కాగా వెడల్పు 100 అడుగులు. ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: