తెలంగాణ సీఎం కేసీఆర్ కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అపూరూపమైన ప్రాజెక్ట్ అని అన్నారు. కల సాకారమైన వేళ నిర్వాసితుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నానని అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల కోసం 4800 మెగావాట్ల విద్యుత్ ను ఉపయోగిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కల నెరవేరిందని చెప్పారు.
భూములు కోల్పోయినవారికి పునరావాసం కల్పించామని అన్నారు. తెలంగాణ ప్రస్తుతం పసిడి పంటల తెలంగాణగా మారిందని అన్నారు. భూ సేకరణలో రెవిన్యూ అధికారులు బాగా పని చేశారని చెప్పారు. ఒకప్పుడు ఏడుపు పాటలుగా ఉన్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు మారిందని చెప్పారు. గజ్వేల్ పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్ పట్టణం రూపుదిద్దుకుంటోందని చెప్పారు.