కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ లో భారీగా సడలింపులు విధించడంతో జూన్ 8 నుంచి ప్రార్ధనా మందిరాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టీటీడీ ఈ నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకెళతామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. దర్శనానికి వచ్చే భక్తులు క్యూ పద్దతి పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మార్గదర్శకాలు :
గంటకు కేవలం 300 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి
స్థానిక పరిస్థితులను బట్టి ఆలయ దర్శనాల టైమింగ్స్ నిర్ణయం
దర్శనానికి వచ్చే భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరి
నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలకు గతంతో పోలిస్తే 30 శాతం మందికి మాత్రమే అనుమతి
కాటేజీల్లోని 50 శాతం గదులను మాత్రమే భక్తులకు కేటాయించనున్న టీటీడీ
కేశఖండన శాలలో క్షురకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు
ఆలయ దుకాణాల్లో ఒకదాన్ని విడిచి మరొకటి తెరిచేలా ఆదేశాలు
అన్నదానం ప్రసాదం, నిత్యాన్నప్రసాదం ఉండదు
పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతి లేదు