
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందని వైద్యులు, ప్రజలు విశ్వసిస్తున్నారు. యూఎస్ ఆర్మీ వ్యాక్సిన్ పరిశోధకులు 2020 చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. సైనిక అంటువ్యాధుల పరిశోధన కార్యక్రమం డైరెక్టర్ కల్నల్ వెండీ సమన్స్ జాక్సన్ కరోనాను కట్టడి చేసే ఏదో ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు.
అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ 2020 చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రైవేట్ సంస్ధలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మరోవైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు చైనా, ఇటలీ దేశాల్లో వ్యాక్సిన్ దిశగా చేస్తున్న ప్రయోగాలు కీలక దశకు చేరుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటడం గమనార్హం.