విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనకాపల్లిలోని కొత్తూరు కాలేజ్ గ్రౌండ్ లో సాయి అనే యువకుడిపై సూర్య అనే యువకుడు కత్తిపోట్లతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సాయికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. క్రికెట్ లో తలెత్తిన చిన్న వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. ప్రస్తుతం సాయి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలలోకి వెళితే రెండు టీంల మధ్య క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్న వివాదం గాలివానగా మారింది.
రెండు టీంలకు చెందిన వ్యక్తులు తలెత్తిన వివాదం వల్ల గొడవ పడ్డారు. అనంతరం సూర్య ఆ గొడవను మనస్సులో పెట్టుకుని మరుసతిరోజు కత్తితో దాడి చేశాడు. అనంతరం సూర్య అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సాయిని అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతుంది.