మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్నట్టు నిజంగా ఈ మద్య మనుషలకు ఏం పోయేకాలం వచ్చిందో కానీ.. కృరమృగాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.  కేరళలో ఓ ఏనుగు విషాదాంతం దేశాన్ని కదిలించింది. ఓ ఏనుగుకు స్థానికులు ఆహారం ఆశ చూపి పైనాపిల్ ఇవ్వగా.. అది తినబోతుండటా దాని లోపలున్న పేలుడు పదార్థాలు పేలి అది తీవ్రంగా గాయపడి.. కొన్ని రోజుల పాటు నొప్పితో అల్లాడి ప్రాణాలు చివరికి నీటిలోనే ప్రాణాలు విడిచింది.  ఈ ఉదంతంపై యావత్ భారత దేశం కన్నీరు పెట్టింది. ఈ దారుణ సంఘటన మర్చిపోకముందే.. కడుపుతో ఉన్న ఆవుకు పేలుడు పదార్థాలు తినిపించి ఘోరానికి పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లా జాందుత్తలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 

 

పొలంలోని గడ్డిలో దాచిన పేలుడు పదార్థాన్ని తిన్న ఆవు దవడ పేలిపోయి రక్తసిక్తమైంది. ఈ వీడియోను యజమాని గురుదయాళ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పొరుగున ఉండే వ్యక్తే ఈ దురాగతానికి పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాపం ఆవు నోరు అంతా పగిలిపోయి దారుణంగా తయారైంది. అయితే ఈ దారుణానికి పాల్పపడిన  తర్వాత నందలాల్ పారిపోవడం అనుమానాలకూ బలం చేకూరుస్తోంది. గాయం కారణంగా ఆవు ఆహారం తినలేక ఇబ్బందిపడుతోంది. పది రోజలు కిందట జరిగిన ఈ ఘోరంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: