తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. జీ.హెచ్.ఎం.సీ పరిధిలో, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీ.హెచ్.ఎం.సీ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండటంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే తరగతి గదికి విద్యార్థులను కేటాయించింది.