కరోనా కష్ట కాలంలో జగన్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. జులై చివరి వారంలో ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలను నిర్వహించనుంది. గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డ్ సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2020 జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్షలకు 11.06 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వీరి కోసం 14 రకాల రాత పరీక్షలను నిర్వహించనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు జులైలోనే జరగనుండటంతో ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది లేకుండా తుది తేదీలను ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. జులై చివరిలో పరీక్షలను ప్రారంభించి 8 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.