ప్రముఖ తమిళ నటులు సూర్య, కార్తి తండ్రి శివకుమార్‌ టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల్లో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌ హౌస్‌లు ఇస్తారని... సామాన్యులకు కనీసం దర్శనం కల్పించకుండా తోసేస్తారని... అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల గురించి శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివ కుమార్‌పై ఈ మెయిల్ ద్వారా టీటీడీకి సమాచారం ఇచ్చారు. 
 
తాజాగా ఈ వివాదం గురించి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కాదని విచారణలో తేలిందని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఆక్షేపించదగినవని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే కేసు నమోదు చేశామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: