తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలా...? వద్దా....? అనే అంశం గురించి మరికాసేపట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ పరీక్షలను రద్దు చేస్తే విద్యార్థులకు ఏ విధంగా గ్రేడ్లను కేటాయించాలనే అంశం గురించి చర్చ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా, లాక్ డౌన్ గురించి కూడా సమీక్షా సమావేశంలో చర్చ జరుగుతోంది. 
 
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మొదలైన తరువాత కరోనా విజృంభణ వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. పరీక్షలు లేకుండా పాస్ చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఏ ప్రాతిపదికన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: