మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మూడేళ్ల చిన్నారికి ఫోన్ చేశారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా సీఎం నిజంగనే ఫోన్ చేశారు. తాజాగా మూడేళ్ల చిన్నారి భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించిందని పాపను సరదాగా మందలించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫూణేకు చెందిన మూడేళ్ల పాప అన్షిక షిండే పాలు అమ్మే వ్యక్తికి డబ్బులు ఇచ్చే క్రమంలో నోట్లను తాకింది. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు మందలించారు. 
 
పాప చేసిన తప్పుకు క్షమాపణ చెబుతానని చెప్పడంతో పాటు ఉద్ధవ్ అంకుల్ కు చెబుతానంటూ చెప్పింది. ఇదంతా సీఎం దృష్టికి రావడంతో ఉద్ధవ్ పాప తండ్రితో మాట్లాడుతూ చిట్టి శివసేన కార్యకర్తను ఇబ్బంది పెట్టకండి అని చెప్పారు. నా పేరు పెట్టి మీరు అన్షికను తిట్టారని నాకు తెలిసిందని వ్యాఖ్యలు చేశారు. పాపతో తల్లిదండ్రులు చెప్పే మాట వింటానని చెప్పాలని... మరోసారి మందలిస్తే తనకు ఫోన్ చేయాలని సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: