రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అనంతరం తమిళనాడు రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉందంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీ విద్యాశాఖ మంత్రి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటన చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూ ఉండటంతో మంత్రి పరీక్షల గురించి స్పష్టత ఇచ్చారు.