వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేశారు. అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ, పరిటాల, నారాయణ ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60 శాతం పెద బాబు, చిన బాబులకు ముడుపులుగా వెళ్లాయంటూ చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందుకే వారు అవినీతిని ప్రోత్సహించారని అన్నారు. 
 
ఇప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా చంద్రబాబు, లోకేష్ నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. మరో ట్వీట్ లో చంద్రబాబు లండన్ లో తన స్నేహితులలో ఒకరైన పారిశ్రామికవేత్తను సంప్రదించాడని తనకు సమాచారం అందిందని... చంద్రబాబు ఇండియా నుంచి పారిపోవడానికి మార్గాలను వెతుక్కుంటున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: