వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ.ఎస్.ఐ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయట పెట్టాలని సూచించారు. వారంతా నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల వల్ల వ్యాధి ముదిరి చనిపోయారని పేర్కొన్నారు. కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు. 
 
మరో ట్వీట్లో వాళ్లంతా 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులని.... ఈ.ఎస్.ఐ సభ్యత్వం కింద నెలకు రూ.5070 చెల్లిస్తారని.... అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటని ప్రశ్నించారు. 900 కోట్ల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారని విజయసాయి ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: