ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కోసం రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ తాజాగా కిడ్నీ పేషెంట్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఫ్రీగా బస్ పాస్‌లను జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. డయాలసిస్‌ చేయించుకునేందుకు తరచుగా వెళ్లే కిడ్నీ పేషెంట్లకు ప్రయాణ ఛార్జీలు అధిక భారంగా మారుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరనుంది. పాక్షికంగా అంధత్వం కలిగిన వారికి కూడా ఫ్రీ పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ సర్కార్ గతంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: