తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ గంగాధర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం, శనివారం నాడు ఆయన మంత్రి ఈటల రాజేందర్ వెంటే తిరిగినట్లు సమాచారం. దీంతో మంత్రి కుటుంబంలో కలవరం మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. తాజాగా మంత్రి ఓఎస్డీకి కరోనా సోకడంతో ఆ శాఖ అధికారుల్లో కలవరం మొదలైంది.
ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీష్ రావు పీఏకు కరోనా సోకగా తాజాగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీకే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మొన్నటివరకు సామాన్య ప్రజలనే తాకిన ఈ మహమ్మారి.. ఇప్పుడు రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండటం గమనార్హం.