ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 294 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు పంచాయతీ శివారు సూర్యారావుపేటలో నిన్న ఒక్కరోజే 26 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అక్కడ 14 కేసులు నమోదు కాగా తాజాగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 40కు చేరింది. దీంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. 
 
మరోవైపు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దాదాపు వెయ్యి కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 51 మంది కరోనా భారీన పడగా  రోగుల సంఖ్య 996కు చేరుకుంది. జిల్లాలో ఇప్పటివరకు 29 మంది వైరస్ వల్ల మృతి చెందారు. ఆదోనిలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో అక్కడ లాక్ డౌన్ అమలవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: