దేశంలో కరోనా విజృంభణ వల్ల మార్చి 25వ తేదీన కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు అమలు చేస్తున్నా కొందరు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా జగన్ సర్కార్ వీరికి శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి కర్ణాటకకు ఈ నెల 17 నుంచి బస్సులు నడపాలని నిర్ణయించింది. కర్ణాటక సర్కార్ అనుమతివ్వడంతో తొలుత 168 సర్వీసులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది. 
 
నేటి నుంచి అన్ లైన్ లో, బస్టాండ్లలో రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా అతి త్వరలో బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య రూట్ పర్మిట్ ఒప్పందం జరగనుందని అది పూర్తయితే అంతర్రాష్ట్ర సర్వీసులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రవాణా శాఖ అధికారిని ఏపీకి ఆహ్వానించి ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు ఒప్పందాలు చేసుకోనున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: