దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారంటూ రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించి లాక్ డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ప్రకటన చేసింది.
రూమర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.... లాక్ డౌన్ ను పొడిగించే ఆలోచన కేంద్రానికి లేదని పేర్కొంది. రేపు, ఎల్లుండి ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో లాక్ డౌన్ గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా కేంద్రం జూన్ 8 నుంచి లాక్ డౌన్ ను దశల వారీగా సడలిస్తూ వచ్చింది.
Claim: A message on facebook claiming strict #Lockdown from 18th June. #PIBFactCheck: It's #Fake. There is no such plan under consideration. Please beware of rumour mongers. pic.twitter.com/NqSXOpy9n9
— PIB Fact Check (@PIBFactCheck) June 14, 2020