దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. గడచిన 24 గంటల్లో 12వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 324 మంది ప్రాణాలు కోల్పోయారు. 12,156 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,33,007కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 9,500 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. గడచిన 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 
 
దేశంలో 169,691 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 153,337 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: