ప్రముఖ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న మధాహ్నం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించలేదు. గడచిన ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్ తో బాధ పడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు. సుశాంత్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ సుశాంత్ మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిని హత్య చేశారని ఆరోపణలు చేశారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని.... అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. పాట్నాలోని సుశాంత్ ఇంటి వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మృతిపై అతని మేనమామ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: