దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే 23 మంది జర్నలిస్టులు కరోనా భారీన పడ్డారు. దీంతో కరోనా భారీన పడిన జర్నలిస్టుల సంఖ్య 70కు చేరింది. గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పాత సచివాలయం భవన సముదాయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 153 మందికి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి కరోనా సోకినట్టు ఆదివారం ఫలితాలొచ్చాయి.
గత మూడు రోజుల్లో 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలింది. గతంలో ఇతర ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మంది జర్నలిస్టులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు భారీన పడిన 70కు చేరిందని జర్నలిస్టుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఒక తెలుగు వార్తా ఛానెల్ మనోజ్‌కుమార్ అనే జర్నలిస్టు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్‌కేఆర్ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్‌ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి కరోనా భారీన పడింది.