మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మేనమామ, శివసేన పార్టీ అధికార పత్రిక ఎడిటర్ ఉద్ధవ్ థాక్రే భార్య రష్మీ థాక్రే తండ్రి మాధవ్ పతంకర్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన 78 ఏళ్ల వయస్సులో నిన్న రాత్రి మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన దహన సంస్కార కార్యక్రమాలు జరిగాయని తెలుస్తోంది. మాధవ్ పతంకర్ కుటుంబం వ్యాపారం నడుపుతూ ముంబైలోని మాతో శ్రీకి సమీపంలో నివశించేవారు. 
 
కిడ్నీ సంబంధ వ్యాధులతో, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఆయన గత కొంతకాలం నుంచి బాధ పడుతున్నాడని తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో అంధేరిలోని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సకు కోలుకోలేక ఆయన మృతి చెందారు. మాధవ్ పతంకర్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: