దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాలు కరోనాను జయించడంతో సక్సెస్ అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఇండోర్ లో 1,058 కరోనా పరీక్షలు చేయగా కేవలం 6 మందికి మాత్రమే కరోనా నిర్ధారణ అయింది.
ఇండోర్ లో నిర్వహించిన పరీక్షల్లో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇండోర్ లో మార్చి 24వ తేదీన 4 కేసులు నమోదు కాగా ఆ తరువాత నిన్న అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. ఇండోర్ లో 2,906 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 989 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Just 6 cases out of 1,000 tests: Big win in Indore's #Covid fight https://t.co/JsrvkkK6Rz via @TOICitiesNews pic.twitter.com/8JGqHXxeMf
— The Times Of india (@timesofindia) June 15, 2020