బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని కుపూర్ ఆస్పత్రిలో ఉన్న సుశాంత్ మృతదేహన్ని ప్రేయసి రెహా చక్రవర్తి సందర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. చాలా కాలంగా సుశాంత్ రెహా చక్రవర్తి డేటింగ్ లో ఉండగా బాలీవుడ్ మీడియాలో వీరి గురించి చాలా గాసిప్స్ వినిపించాయి. నవంబర్ నెలలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. 
 
గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధ పడుతున్న సుశాంత్ అందువల్లే ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. సోమవారం రోజున పోస్ట్‌మార్టం ప్రాథ‌మిక‌ నివేదిక‌ను వారు విడుదల చేశారు. సుశాంత్ అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నటుడి అవయవాలను జేజే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సుశాంత్ మృతి గురించి రెహా చక్రవర్తిని ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: