దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అధికంగా కేసులు నమోదవుతున్న రాజధాని చెన్నై సహా నాలుగు జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనుంది. 
 
చెన్నై, చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు కానుంది. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు సర్కార్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ సడలింపులను కుదించనుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఇప్పటివరకు 42,687 కేసులు నమోదు కాగా 23,904 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 397 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: