జమ్మూ కశ్మీర్ లోని షోపియాన్ లో ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి. గడచిన 24 గంటల్లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్ఫీఎఫ్, షోషియాన్ జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు భారత సైనికులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత సైనికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని సమాచారం.
షోషియాన్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో 30కు పైగా ఉగ్రవాదులు భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భారత సైన్యం పెద్ద ఎత్తున తీవ్రవాదుల ఏరివేత చర్యలను ప్రారంభించింది. సైన్యంవైపు ఎలాంటి నష్టం జరగకుండా తెలివిగా ముష్కరులను మట్టుబెడుతున్నారు.