ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 15,911 నమూనాలను పరీక్షించగా 264 మంది కరోనా భారీన పడ్డారు. వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో ఈ మేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 193 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 71 మంది ఉన్నారని తెలుస్తోంది. 
 
గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,280 కు చేరగా 2,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలిపితే ఈ సంఖ్య 6,720గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: