తెలంగాణ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కోఠిలోని గోకుల్‌చాట్‌ యజమానికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోకుల్ చాట్ ను మూసివేసి 20 మంది సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. హైదరాబాద్ లో రోజూ వేల మంది గోకుల్ చాట్ లో చాట్ ఆరగిస్తారు. 
 
యజమానికి కరోనా నిర్ధారణ కావడంతో గత మూడు రోజులుగా గోకుల్ చాట్ కు వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ విషయం తెలిసి అక్కడ చాట్ కొనుగోలు చేసిన వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో గత 24 గంటల్లో 219 మందికి కరోనా నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 5,193కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: