భారత్ ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. భారత్ నాన్ పర్మినెంట్ సభ్యునిగా ఆసియా-పసిఫిక్ రీజన్‌ నుంచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో 193 దేశాలు ఉండగా 184 దేశాలు భారత్ కు అనుకూలంగా ఓట్లు వేశాయి. ఐక్యరాజ్యసమితి తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ విజయం సాధించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 
 
నిన్న ఐరాస భద్రతామండలిలోని ఐదు నాన్ పర్మినెంట్ సభ్యత్వ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆసియా పసిఫిక్ రీజియన్ లో చైనా, పాకిస్తాన్ తో పాటు 55 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు భారత్ కు గతేడాది జూన్ లో మద్ధతు పలకడంతో మన దేశం ఏకగ్రీవంగా గెలుపొందింది. మొత్తం 192 ఓట్లు పోలవ్వగా 184 ఓట్లు భారత్ కు లభించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: