ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మనం ప్రతి ఏడాది జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత లద్దాఖ్‌లోని లేహ్‌ నుంచి ప్రసంగించాలని మోదీ భావించినా వివిధ కారణాల వల్ల ఢిల్లీ నుంచే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
ప్రధాని మోదీ యోగా విశిష్టత గురించి ప్రధానంగా ప్రసంగించనున్నారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభం కానుండగా ప్రధాని చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇండియా ప్రతిస్పందనను కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2014 డిసెంబర్‌ 11న ఐరాస జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: