దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఫోన్ చార్జ‌ర్‌ను ఉప‌యోగించి కరోనావైరస్‌ను చంపొచ్చ‌ని ఇజ్రాయెల్ పరిశోధకులు చెబుతున్నారు. హైఫాలోని టెక్నియన్ విశ్వవిద్యాలయ బృందం యుఎస్‌బి కేబుల్‌, మాస్క్‌తో ప్రయోగం చేసి.... తాము తయారుచేసిన మాస్క్ ను 30 నిమిషాలు ఛార్జ్ చేయడం ద్వారా క‌రోనా వైర‌స్ చ‌చ్చిపోతుందని తెలిపారు. 
 
చార్జ‌ర్‌, కార్బన్ ఫైబర్స్ మాస్క్‌ పొరను 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుందని వారు తెలిపారు. జెరూసలేంలోని హడస్సా మెడికల్ సెంటర్‌లో అంటు వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ అలోన్ మోసెస్ 70 డిగ్రీల వేడి దగ్గర వైరస్ చచ్చిపోతుందని తెలిపారు. అదే సమయంలో వైరస్ ను తొలగిద్దామని పదే పదే వేడి చేస్తే మాస్క్ చెడిపోతుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: