తూర్పు లఢఖ్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాస్తవాధీన రేఖకు అటువైపు మాత్రమే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని చైనాకు భారత్ సూచించింది. ఏకపక్ష చర్యలకు పూనుకోవద్దని తేల్చి చెప్పింది. గాల్వన్ లోయ తమదేనంటూ డ్రాగన్ దేశం చేస్తున్న వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది. చైనా తమది కాని భూభాగాన్ని తమదే అని చెప్పుకునే తీరును మార్చుకోవాలని పేర్కొంది. 
 
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ ఇరుదేశాల ఉన్నతస్థాయి మిలటరీ అధికారుల మధ్య జూన్ 6వ తేదీన కుదిరిన ఒప్పందానికి చైనా వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సైనికులెవరూ గల్లంతు కాలేదని.... సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత్‌ స్పష్టంగా ఉందని.... చైనా సరిహద్దులు దాటరాదని సూచించారు. తమ కార్యకలాపాలన్నీ వాస్తవాధీన రేఖకు ఇటువైపే జరుగుతున్నందున చైనా కూడా వారి భూభాగంలోనే కార్యకలాపాలను నిర్వహించాలని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: