గల్వాన్ లోయలో 20 మంది జవాన్లు ఘర్షణల్లో మృతి చెందటంతో భారత్ చైనాపై ఒత్తిడి పెంచటానికి రంగం సిద్ధం చేస్తోంది. భారత్ లో ఆ దేశ ఉత్పత్తులను గణనీయంగా తగ్గించటానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. చైనాతో కుదుర్చుకున్న పలు ఒప్పందాల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు వైదొలగుతున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశాయి. తాజాగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మీడియాతో మాట్లాడుతూ చైనా, ఇతర దేశాల నుంచి చవకబారు ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తామని... త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారు. 
 
ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించాలని ఆయన సూచించారు. బీఐఎస్‌ నిబంధనలను అమలుచేసి, చవకబారు ఉత్పత్తులను నిలిపివేస్తామని.... . 371 వస్తువుల దిగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని.... ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలు పెంచడంపై కూడా యోచిస్తున్నామని తెలిపారు. మరోవైపు భారత్ ఇకమీదట  చైనాపై  ఆధారపడరాదని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: