దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఇదే సమయంలో రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు ఆ శాఖ ప్రకటన చేసింది. అసిస్టెంట్ లోకో పైలెట్ల విభాగంలో 26,968... టెక్నీషియన్ విభాగంలో 28,410 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపింది. 
 
దేశవ్యాప్తంగా 55,378 ఉద్యోగాల భర్తీ జరిగినట్లు ఆ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ ప్రకటించిన ముందే చాలామందికి నియామక పత్రాలు పంపామని అయినా వారు విధుల్లో చేరలేదని రైల్వే శాఖ పేర్కొంది. ఎంపికైన ఉద్యోగులలో 10,123 మంది ఏఎల్పీలకు నాలుగు వారాల పాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తామని ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: