కరోనా ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో ? చూస్తూనే ఉన్నాం. ఇక మనదేశంలో కరోనాను కట్టడి చేయలేకపోతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో వేలాది పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పరీక్షలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కోర్టులు సైతం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టగా... ప్రతిపక్షాలు విమర్శలు.. కేంద్రం సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని హోల్ సెల్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై వీరు ఉదయం 10.00గంటల నుంచి సాయంత్రం 4.00గంటల వరకు మాత్రమే షాపులు వుంటాయని తెలిపారు. నగరంలోని అంబర్ బజార్లోని వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన ప్రతి వ్యాపారులు కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా పూర్తిగా తగ్గిపోయే వరకు ఇదే నిబంధన ఉంటుందని వారు తీర్మానించుకున్నారు.