విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు తాజాగా తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టియాలని... పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. 
 
అధికార పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నానన్న కక్షతో తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం తొలగించారని మున్సిపల్ కమిషనర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: