ఏపీ ఈఎస్ఐ స్కాంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అవినీతి నిరోధక శాఖ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఈ స్కాంలో సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించిన అధికారులు తాజాగా మొత్తం 8 మంది ఉద్యోగులు ఈ స్కాంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అధికారులు గుర్తించిన ఉద్యోగులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరి మొబైల్ ఫోన్స్ కూడా స్విఛాఫ్ వస్తున్నాయని సమాచారం. కాల్ డేటా, సిగ్నలింగ్ ద్వారా ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో ఏసీబీ ఆరా తీస్తోంది. సచివాలయ ఉద్యోగులకు మంత్రిగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు టెండర్లు ఏకపక్షంగా ఇవ్వాలని లేఖలు పంపినట్టు తెలుస్తోంది. ఈసీజీ, టోల్ ఫ్రీ సర్వీస్, టెలీ సర్వీస్, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో కంపెనీలకు లబ్ది చేకూర్చేలా అచ్చెన్నాయుడు నిర్ణయాలు తీసుకున్నాడని అధికారుల విచారణలో తేలింది.