సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలపై కేంద్రం సీరియస్‌గా ఉంది. అమరులైన 20 మంది జవాన్ల వీరత్వం ఏ మాత్రం వృధా కాదని వ్యాఖ్యలు చేసిన మోదీ తదుపరి ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి దేశంలోని వివిధ పార్టీల అధ్యక్షులు హాజరవుతారు. అఖిలపక్ష భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. 
 
ఈ సమావేశంలో మోదీ ప్రధానంగా చైనాతో భవిష్యత్తులో ఏ రకంగా వ్యవహరించాలనే అంశం గురించి చర్చించనున్నారు. నేతల నుంచి వచ్చే సలహాలు, సూచనలను మోదీ స్వీకరించనున్నారు. చైనా ఉత్పత్తులపై నిషేధం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది. తాజా ఘటనతో ఇక భారత్ ఏ మాత్రం సహనం వహించకూడదన్న భావన దేశవ్యాప్తంగా ఉండటంతో భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: