ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. వైసీపీ తరపున నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా టీడీపీ తరపున ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ టీడీపీ తరపున వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరగనుండగా 5 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. 
 
టీడీపీ తరపున ఎస్సీ అభ్యర్థి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు 18 మంది టీడీపీ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. గెలవని స్థానానికి పోటీ చేయించి దళితులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: