ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక పాలసీ గురించి గత కొన్ని రోజులుగా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి విశ్వరూప్ ఇసుక విషయంలో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సొంత ఇంటి కోసం మంత్రి విశ్వరూప్ నాలుగు లారీల ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఒక లారీ ఇసుక కోసం 17,000 రూపాయల చొప్పున చెల్లించారు.
అధికారులు రాళ్లు,మట్టి పెళ్లలతో కూడిన ఇసుకని పంపారు. ఇసుక పూర్తిగా పాడైపోయిందని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న నాకే ఇలాంటి దరిద్రపు ఇసుక పంపితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సాక్షాత్తూ మంత్రే ఇలా వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ ఇసుక పాలసీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సాధారణ ప్రజలకు కూడా అధికారులు ఇలాంటి ఇసుక పంపితే ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది.