ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 465 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 7,961కి పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాల పరిధిలో లాక్ డౌన్ ను ప్రకటించింది. అనంతపురం జిల్లా యాడికిలో జూన్ 2న తొలి కేసు నమోదు కాగా ప్రస్తుతం ఆ గ్రామంలో 29 మంది వైరస్ భారీన పడ్డారు. వీరిలో ఒకే కాలనీకి చెందిన 16 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
ధర్మవరంలో ప్రజాప్రతినిధి గన్ మెన్ కరోనాతో మృతి చెందగా ఆ వ్యక్తి నుంచి ఆరుగురికి కరోనా సోకింది. ధర్మవరంలో ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో వారం రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఒంగోలు, చీరాలలో లాక్ డౌన్ విధుస్తున్నట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: