దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా సీఎం జగన్ ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో దూసుకుపోతున్నారు. సీఎం జగన్ వైఎస్సార్‌ నేతన్న నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు. అర్హులైన చేనేత కార్మికుల ఖాతాలలో ప్రభుత్వం 24,000 రూపాయలు జమ చేయనుంది. 
 
వాస్తవానికి ఈ పథకాన్ని ప్రభుత్వం డిసెంబర్ నెలలో అమలు చేయాల్సి ఉన్నా కరోనా విజృంభణ వల్ల ఆరు నెలలు ముందుగానే సహాయం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 81,024 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పాదయాత్ర సమయంలో ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే హామీని నిలబెట్టుకుంటున్నారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: