దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే సమయంలో కరోనా వైరస్ చికిత్సకు మందు మార్కెట్లోకి వచ్చింది. ఫావిపిరవిర్ టాబ్లెట్లను ఫార్మా దిగ్గజం గ్లెన్ మార్క్ ఫాబిఫ్లూ మార్కెట్లోకి విడుదల చేసింది. కేంద్రంతో కలిసి మెడిసిన్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.
ఈ మెడిసిన్ ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే విక్రయించనున్నట్టు సంస్థ చెబుతోంది. గ్లెన్‌మార్క్ చైర్మన్ గ్లెన్ సల్దన్హా మాట్లాడుతూ ఫావిపిరవిర్ టాబ్లెట్ ధర 103 రూపాయలుగా ఉన్నట్టు తెలిపారు. కరోనా భారీన పడ్డవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలని.... 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను 14 రోజుల పాటు రోజుకు రెండు పూటలా వేసుకోవాలని సూచించారు.